మంత్రి జ‌వ‌హ‌ర్‌కు మాతృవియోగం

0

ఏపీ ఎక్సైజ్‌ శాఖామంత్రి కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ మాతృమూర్తి కొత్తపల్లి దానమ్మ (89) పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం సాయంత్రం మృతి చెందారు. దానమ్మ మృతదేహాన్ని కొవ్వూరు నుంచి స్వగ్రామమైన గానుగపాడుకు తీసుకురానున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయురాలిగా ఆమె పలువురికి విద్యాబుద్ధులు నేర్పించారు. ఈమెకు ఏడుగురు సంతానం కాగా వారిలో అయిదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో మంత్రి జవహర్‌ చిన్నవాడు. దానమ్మ మృతి పట్ల స్థానిక టీడీపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రికి సానూభూతి తెలిపారు.

Share.

Leave A Reply

%d bloggers like this: