రంగ స్థలం 18 కోట్ల నైజాం రైట్స్

0

ఫస్ట్ ఫస్ట్ లుక్స్ తో మంచి రెస్పాన్స్ ను పొందుతున్న రామ్ చరణ్ తేజ తాజా సినిమా ‘రంగస్థలం-1985’ ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డు స్థాయి నంబర్లను పలుకుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా నైజాం రైట్స్ కు సంబంధించి ఇప్పుడు ప్రీ రిలీజ్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఏకంగా 18 కోట్ల రూపాయల ధరకు ఈ సినిమా నైజాం రైట్స్ ను సొంతం చేసుకున్నారట యూవీ క్రియేషన్స్ వాళ్లు.ఈ మధ్య రిలీజ్ అయిన పెద్ద సినిమాల్లో నైజాంలో ఈ స్థాయి ధర పలికిన సినిమా మరోటి లేదనే చెప్పాలి. ఎన్టీఆర్, మహేశ్ బాబు సినిమాల నైజాం రైట్స్ కన్నా కాస్త ఎక్కువ ధరనే పలికింది రామ్ చరణ్ తేజ సినిమా ధర. రామ్ చరణ్ కెరీర్ నైజాం ఏరియాలో ఈ స్థాయి కలెక్షన్లు వచ్చిన సందర్భాలు తక్కువే. అయినప్పటికీ.. 18 కోట్ల రూపాయలు పెట్టి ఆ ప్రాంత థియేటరికల్ రైట్స్ ను యూవీ క్రియేషన్స్ కొనుగోలు చేయడం గమనార్హం.ఒకవైపు ‘సాహో’ వంటి భారీ సినిమాను రూపొందిస్తోంది యూవీ సంస్థ. డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా ఈ సంస్థ భారీ స్థాయి హంగామానే చేస్తోంది. వైవిధ్యభరితమైన సినిమా అనే ప్రచారం రావడం, సుకుమార్ దర్శకత్వంపై ఉన్న అంచనాలు.. వంటివన్నీ కలిసి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను భారీ స్థాయికి తీసుకెళ్తున్నాయి. నైజాంలోనే 18 కోట్ల రూపాయలు అంటే… ఇక మిగిలిన తెలుగు ప్రాంతాల్లో, ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ వంద కోట్ల మార్కును టచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Share.

Leave A Reply

%d bloggers like this: