రూపాయికే నల్లా కనెక్షన్ లో అక్రమాల చెల్లు

0

పేద ప్రజల కోసం మున్సిపాలిటీల్లో ప్రవేశపెట్టిన రూ.1కే నల్లా కనెక్షన్‌లు పక్కదారి పడుతున్నాయి. రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నవారికే నల్లా కనెక్షన్‌లు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ఏడాదికి రూ. 2 వేల లోపు ఇంటి పన్ను చెల్లించే వారికే ఈ పథకం వరిస్తుండగా ఆర్థికంగా స్థిరపడిన ధనిక వర్గాల వారికే కనెక్షన్‌లు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. పక్కా భవనాలు, ఆర్థికంగా స్థిరపడినవారికే రూ. 1 నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేశారు. మున్సిపల్ అధికారులు నల్లా కనెక్షన్ వ్యవహారంలో పె ద్ద ఎత్తున సంపన్న వర్గాల నుంచి ముడుపులు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పేద ప్రజల కో సం ప్రవేశపెట్టిన ఈ పథకం ధనిక వర్గాలకే పరిమితం కాగా అర్హులైన నిరుపేదలు నల్లా కనెక్షన్‌లు లభించగా నానా ఇబ్బందులకు గురువుతున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఒక రూపాయికి నల్లా కనెక్షన్ లు 628 ఇవ్వగా, మొత్తం నల్లా కనెక్షన్లు 13,312 ఉం డగా సబ్సిడీ కనెక్షన్లపై నెలకు రూ.150 బిల్లులు వ సూలు చేస్తున్నారు. అదే విధంగా కమర్షియల్ నల్లాల కు రూ. 600 నుంచి 1000 వరకు వసూలు చేస్తుండగా ఏడాదికి వచ్చే నల్లాల బిల్లుల ఆదాయం సుమారు 2.42 కోట్లు ఉంటుంది. అయితే మంచిర్యాలలో దాదా పు 1.10 లక్షల జనాభాకు 16.05 ఎల్‌ఎండి నీటి సరఫరా చేయాల్సి ఉండగా ఒక రోజు విడిచి మరో రోజు 7 ఎల్‌ఎండి చొప్పున అందిస్తున్నారు. పట్టణ ప్రజలకు ముల్కల్ల గోదావరి వద్ద గల ఇన్‌టెక్‌వెల్, గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే గతంలో నల్లా కనెక్షన్ ఒక్కంటికి నె లకు రూ. 75 వసూలు చేస్తుండగా ప్రస్తుతం అధికారులు రూ. 150 తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా మంచిర్యాల మున్సిపాలిటీలో తాగునీటి కోసం నల్లా కనెక్షన్ తీసుకునే ప్రజలు రూ.6 వేల నుంచి 50 వేల రకు డిపాజిట్ చెల్లించాల్సిండగా పేద ప్రజలకు ఇవ్వాల్సిన రూ. 1 నల్లా కనెక్షన్ తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఏడాదికి 2 వేల లోపు ఇంటి పన్ను చెల్లించే వారికే 1 కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా రూ. 2001 నుంచి రూ. 5000 వరకు ఇంటి పన్ను చెల్లించే వారికి అక్రమంగా అధికారులు నల్లా కనెక్షన్లు ఇవ్వడం వలన మున్సిపాలిటీకి లక్షలాది రూపాయల ఆదాయానికి గండిపడింది. రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల అండదండలతో కొందరు అక్రమార్కులు రూ. 1 నల్లా కనెక్షన్ పొందినట్లు సమాచారం. ఏదిఏమైనా ధనిక వర్గాల వారు తీసుకున్న కనెక్షన్‌ల విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: