రెజ్ల‌ర్ సుశీల్ ను రూ.55 ల‌క్ష‌లకు ద‌క్కించుకున్న ఢిల్లీ సుల్తాన్స్‌

0

మూడేళ్ల తర్వాత మళ్లీ మ్యాట్‌పై అడుగు పెట్టిన భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–3లో అత్యధిక ధర పలికింది. ఇటీవలే కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన సుశీల్‌ను ఢిల్లీ సుల్తాన్స్‌ ఫ్రాంచైజి రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. జనవరి 9 నుంచి ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ మూడో సీజన్‌ మొదలవుతుంది. శనివారం జరిగిన రెజ్లర్ల వేలం కార్యక్రమంలో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మలిక్‌ను ముంబై మహారథి జట్టు రూ. 39 లక్షలకు సొంతం చేసుకుంది. సాక్షి మలిక్‌ భర్త సత్యవర్త్‌ కడియాన్‌ను ముంబై జట్టు రూ. 12 లక్షలకు దక్కించుకుంది. యూపీ దంగల్‌ జట్టు రూ. 25 లక్షలకు బజరంగ్‌ పూనియాను… రూ. 40 లక్షలకు వినేశ్‌ ఫోగట్‌ను, రూ. 28 లక్షలకు గీత ఫోగట్‌ను దక్కించుకుంది. ఇరాన్‌ స్టార్‌ రెజ్లర్‌ హసన్‌ రహీమి సబ్జాలిపై హరియాణా హ్యామర్స్‌ జట్టు రూ. 46 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది.

Share.

Leave A Reply

%d bloggers like this: