రోజా పార్ట్ టైం ఎమ్మెల్యే

0

రోజా పార్ట్‌ టైం ఎమ్మెల్యే… అక్రమాలు, అకృత్యాలు, అత్యాచారాల గురించి రోజా, వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది… అని తెలుగు మహిళా నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు పోతురాజు ఉమాదేవి మాట్లాడుతూ మహిళాభ్యుదయం తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. దాచేప‌ల్లి వంటి ఘటనలు జరిగినప్పుడు సంయమనం పాటించాల్సిన ప్రతిపక్షం రాజకీయం చేయటం శోచనీయమన్నారు. ప్రధాన కార్యదర్ళి వేణుగుంట రాణి మాట్లాడుతూ దాచేపల్లిలో లైంగికదాడి బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా ఉండా ల్సింది పోయి పరామర్శల పేరుతో ప్రతిపక్షం, ఎమ్మెల్యే రోజా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబును, జిల్లా యంత్రాగాన్ని రోజా తప్పు పట్టడం దారుణమన్నారు. లైంగికదాడి నిందితుడు సుబ్బయ్య కుమారుడు చిట్టిబాబు మీ పార్టీ నాయకుడన్న విషయం తెలియదా అంటూ నిలదీశారు. ఈ సమావేశంలో మహిళానేతలు పానకాల వెంకట మహాలక్ష్మి, పుల్లమ్మ, లక్ష్మీనరసమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: