రోడ్డు ప్ర‌మాదంలో న‌వ వ‌రుడు మృతి

0

ఈ నెల 12వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొత్త పెళ్లి కొడుకు ఆస్పత్రికిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ సంఘటన గంగాధర నెల్లూరు మండలం కొట్రకోన పంచాయతీలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. లక్ష్మిరెడ్డిపల్లికి చెందిన రామ్మూర్తి కుమారుడు లోకనాథం (27) ఎంఎస్సీ వరకు చదివాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించినా రాకపోవడంతో రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్‌ 30వ తేదీన తిరుపతికి చెందిన నదియాను పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 12వ తేదీన సొంత పనుల నిమిత్తం బుల్లెట్‌లో గంగాధరనెల్లూరు బయలుదేరాడు. పెద్దకాల్వ సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో లోకనాథం కిందపడిపోయాడు. పడిన చోట రాయి ఉండడంతో తలకు తీవ్రగాయమైంది. కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పెళ్లయిన 20 రోజులకే లోక‌నాథం మృతిచెందడంతో లక్ష్మిరెడ్డిపల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతిడి భార్యను చూసి కంట‌త‌డి పెట్ట‌నివారు లేరు.

Share.

Leave A Reply

%d bloggers like this: