ర‌చ‌యిత దేవిప్రియ‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

0

ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. తెలుగులో ప్రముఖ రచయిత దేవిప్రియ కేంద్ర 2017సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన ‘గాలి రంగు’ కవితా సంపుటికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు కవిత్వానికి, జర్నలిజానికి ఆయన సేవలందిస్తున్నారు. ‘అమ్మచెట్టు’ ‘గరీబుగీతాలు’, ‘నీటిపుట్ట’, ‘అరణ్యపురాణం’ వంటి రచనలు ఆయన చేశారు. అనువాద విభాగంలో వీణా వల్లభరావుకు ‘విరామమెరుగని పయనం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. పంజాబీ భాషలోని ఖానాబదోష్ ఆత్మకథను తెలుగులోకి వల్లభరావు అనువదించారు. కాగా, 24 భాషల్లో ఈ అవార్డులను ప్రకటించారు.ఈ అవార్డులను ఫిబ్రవరిలో అందజేయనున్నారు. అవార్డు గ్రహీతలకు తామ్రపత్రం, లక్ష రూపాయల నగదు బహుమానంను అకాడమీ ఇవ్వనుంది.

Share.

Leave A Reply

%d bloggers like this: