ర‌వితేజ నేల టికెట్

0

అభిమాన హీరో సినిమాను మల్టీప్లెక్స్‌లో చూస్తే ఏం మజా వస్తుంది? అదే నేల టికెట్‌ తీసుకొని గోల చేస్తే… అది కదా అభిమానికి నిజమైన సంతృప్తి. ఇలాంటి అభిమానుల్లో రవితేజ ఫ్యాన్స్‌ కూడా ఉంటారు. మాస్‌ ఆడియన్స్‌ను అలరించటంలో మాస్‌ రాజా రవితేజది ఒక స్టైల్‌. తన ప్రతి సినిమాలో మాస్‌ అంశాలను మిస్‌ కాకుండా చూసుకుంటూ ఉంటారు. రవితేజ ఈసారి టైటిల్‌ దగ్గర నుండే మాస్‌ ఆడియన్స్‌ను గోల పెట్టించడానికి సిద్ధమయ్యారని సమాచారం. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రవితేజ చేయబోతున్న తదుపరి చిత్రానికి మాస్‌ టైటిల్స్‌ను వెతికే పనిలో పడ్డారు దర్శకుడు. అందులో భాగంగానే ‘నేల టికెట్‌’ అనే టైటిల్‌కు మొగ్గు చూపుతున్నారని ఫిలింనగర్‌ సమాచారం. ఎస్‌ఆర్‌టి పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జనవరి మొదటి వారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. ఇందులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ లేదా లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తారని భోగట్టా.

Share.

Leave A Reply

%d bloggers like this: