లారీ ఢీకొని ముగ్గురి మృతి

0

ఖమ్మ జిల్లా వైరా మండలం పినపాక స్టేజీ గ్రామం వద్ద ఓ లారీ గురువారం ఉదయం బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ జనాలపైకి దూసుకురావడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఖమ్మం వైపు నుంచి వస్తున్నలారీ వేగంగా వస్తూ రోడ్డుపక్కన ఉన్న వారిపైకి దూసుకొచ్చింది. దీంతో సోమరాజు, దావీదు, అమర్లపూడి దామిని(5) అనే చిన్నారి మృతిచెందారు. కాగా… లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. తప్పతాగిన డ్రైవర్ లారీ అతివేగంగా నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వైరా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: