లాలూ కుమార్తెపై ఈడీ చార్జిషీట్‌

0

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మీసా భారతి, ఆమె భర్త శైలేశ్‌ కుమార్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చార్జిషీట్‌ దాఖలు చేసింది. ప్రత్యేక కోర్డు జడ్జి ఎన్‌కే మల్హోత్రా ఎదుట ఈడీ న్యాయవాది నితేశ్‌ రాణా శనివారం చార్జిషీటు దాఖలు చేశారు. మీసా, శైలేశ్‌లపై నమోదైన మనీ ల్యాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే ఢిల్లీలోని వారి ఫామ్‌ హౌస్‌ను అటాచ్‌ చేసింది. ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ కింద దక్షిణ ఢిల్లీలోని ఫామ్‌ హౌస్‌ను అటాచ్‌ చేశాం. ఆ ఫామ్‌ హౌస్‌ మీసా, శైలేశ్‌లకు చెందినది. మిషైల్‌ ప్యాకర్స్‌ అండ్‌ ప్రింటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరు మీద నమోదైంది. 2008–09లో మనీ ల్యాండరింగ్‌లో భాగంగా రూ.1.2 కోట్లతో దాన్ని కొనుగోలు చేశారు’ అని ఈడీ పేర్కొంది. మీసా భారతి, శైలేశ్‌ ఈ కంపెనీకి డైరెక్టర్లుగా కూడా పని చేశారని ఆరోపించింది.

Share.

Leave A Reply

%d bloggers like this: