లీడ‌ర్‌గా ఎదుగుతున్న భార‌త్‌.. అమెరికా

0

ఇటీవల భారతీయులకు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ సహా ఇతర రంగాల నిపుణులకు నిద్ర‌లేకుండా చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భార‌త్ ప‌ట్ల అభిమానం చూపుతున్నారు. భార‌త్ లీడ‌ర్‌గా ఎదుగుతోంద‌ని కితాబిచ్చారు. బ్యాలెన్సింగ్ పవర్ గా ఉన్న భారత్.. ఇప్పుడు లీడింగ్ పవర్ గా మారుతోందని. ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను తమ దేశం గుర్తిస్తోంద‌ని అమెరికా తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా నూతన జాతీయ భద్రతా విధానాన్ని ప్రకటించింది. ఇందులో గ్లోబల్ శక్తిగా భారత్ ఆవిర్భవిస్తున్న తీరును అమెరికా మెచ్చుకుంది. భారత్ కు సహకారాన్ని అందించేందుకు పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. భద్రతా వ్యూహాం కింద ట్రంప్ ప్రభుత్వం భారత్ కు పూర్తి అండగా నిలవనుంది. భార‌త్‌తో బలమైన వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకోన్నట్లు వెల్లడించింది. అమెరికా ప్రభుత్వం రూపొందించిన వ్యూహాత్మక డాక్యుమెంట్ ఈ అంశాన్ని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా భారత్ ఎదుగుతున్న తీరును అమెరికా కీర్తించింది. జపాన్ – ఆస్ట్రేలియాతో పాటు భారత్ కు సహకారం అందించనున్నట్లు అమెరికా పేర్కొంది. రక్షణ భాగస్వామ్యంలో భారత్ కీలకమైన దేశమని స్ప‌ష్టం చేసింది. మరోవైపు మన పొరుగున ఉన్న చైనాపై అమెరికా తన అసంతృప్తిని ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. దక్షిణ ఆసియాలో చైనా మాత్రం తన శత్రు దేశమని వెల్లడించారు.

Share.

Leave A Reply

%d bloggers like this: