వాజ‌పేయి హెల్త్ బులెటిన్ విడుద‌ల‌

0

మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజపేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. వాజపేయి చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిమ్స్ ఆసుపత్రి మెడికల్ అండ్ ప్రోటోకాల్ డివిజన్ చైర్ పర్సన్ డాక్టర్ ఆర్తి విజ్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అయితే ఇన్‌ఫెక్షన్ తగ్గేవరకూ వాజపేయి ఆసుప్రతిలోనే ఉంటారని ఆయన చెప్పారు. సోమవారం ఉదయం వాజపేయి తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఆయనను హుటాహుటిన అఖిల భారత వైద్యవిజ్ఞానశాస్త్రాల సంస్థ- ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఎంతోకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధ వ్యాధితోనూ, మూత్రపిండాల సమస్యతోనూ బాధపడుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు. సాధారణ వైద్యపరీక్షల నిమిత్తం, రొటీన్‌ చెకప్‌ కోసమే ఆయనను ఆసుపత్రికి తరలించారని బీజేపీ చెబుతున్నప్పటికీ- వాజపేయి దీర్ఘకాల అస్వస్థత దృష్ట్యా ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, వాజపేయి రాజకీయ సహచరుడు లాల్‌ కృష్ణ ఆడ్వాణీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, సుష్మా స్వరాజ్‌.. మొదలైన అనేకమంది ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మోదీ ఆసుపత్రిలోనే దాదాపు గంటసేపు ఉన్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలో డాక్టర్ల బృందం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తోంది.

Share.

Leave A Reply

%d bloggers like this: