విచిత్రం..జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో గోదావ‌రి బ్రిడ్జికి ముప్పు.!

0

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విషయంలో ఏపీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 12వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. అయితే ఈ యాత్ర విషయంలో ఏపీ అధికారుల నుంచి వైఎస్సార్ సీపీ నాయ‌కుల‌కు చిత్రమైన సమాచారం వచ్చింది. కొవ్వూరు నుంచి రాజమండ్రికి వచ్చేందుకు గోదావరి బ్రిడ్జిపై వైఎస్ జగన్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని డీఎస్పీ తెలిపారు. బ్రిడ్జీపై పాదయాత్ర సాగితే…వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని బ్రిడ్జి పరిస్థితి బాగాలేనందున అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపారు.
టీడీపీలో ద‌డ‌..
గుంటూరు జిల్లా నుంచి కృష్ణాలోకి వచ్చే సమయంలో కనకదుర్గమ్మ వారధి గుండా సాగిన వైఎస్ జగన్ పాదయాత్రకు పెద్ద ఎత్తున జనసందోహం కదలివచ్చిన సంగతి తె లిసిందే. ఈ జనసందోహం అనేక మంది ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో ఒక ఆందోళ‌న మొద‌లైంది. ఈ క్ర‌మంలోనే గోదావ‌రి బ్రిడ్జిపై పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌డానికి టీడీపీ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని వైఎస్సార్ సీపీ నాయకుడు రౌతు సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద కూడా బహిరంగ సభ జరపవద్దని పోలీసులు సూచించడం దారుణమన్నారు. ప్రజల్లో భయందోళన కలిగేలా పోలీసులు నోటీసులు ఇవ్వడం బాధాకరమన్నారు. గోదావరి బ్రిడ్జీపై ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేవన్నారు. గతంలో వైఎస్ జగన్ ఎక్కడ పాదయాత్ర చేసినా నిరాకరించలేదన్నారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
చివ‌ర‌కు అనుమ‌తి..
గోదావరి బ్రిడ్జిపైనే పాదయాత్రపై డీఎస్పీ తీసుకున్న నిర్ణయంపై రౌతు సూర్యప్రకాశ్ఎస్పీకి వివరించారు. దీంతో గోదావరి బ్రిడ్జిపై వైఎస్ జగన్ పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అర్బన్ ఎస్పీ రాజకుమారిని కొద్దిసేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కలిశారు. నిబంధనలకు లోబడి పాదయాత్ర చేసుకోవాలని ఎస్పీ రాజకుమారి అనుమతిచ్చారు. పాదయాత్రకు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు

Share.

Leave A Reply

%d bloggers like this: