విరుష్క దంపతుల‌కు మోదీ ఆశీర్వాదం

0

భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ దంప‌తుల‌ను ప్ర‌ధాని మోదీ ఆశీర్వ‌దించారు. విరుష్క‌ వివాహ విందు గురువారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో విరాట్ కోహ్లి-అనుష్కలు ఈ నెల 11న హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులే ఈ పెళ్లికి విచ్చేశారు. దీంతో తమ కుటుంబసభ్యులు, బంధువులు, మరికొందరు సెలబ్రిటీల కోసం నిన్న (శుక్రవారం రాత్రి) గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది విరుష్క జోడీ. కాగా ఈ నూతన జంట బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిసి, రిసెప్షన్‌ రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఈ నెల 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు కోహ్లి రిసెప్షన్‌ ఇవ్వనున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: