శివ‌య్య‌ సేవ‌లో ప్ర‌ముఖులు

0

వాయులింగేశ్వరుని సేవలో ఆదివారం పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ జనరల్‌ జస్టిస్‌ మన్వీందర్‌రాయ్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌లకు ఆలయ ఈవో భ్రమరాంబ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనార్థం వచ్చిన వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. వీరికి ఆలయం తరఫున స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తి సంధ్యారాణి, డీఎస్పీ వెంకటకిషోర్‌ ఆలయ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ముంబయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వప్నజోషి, కోల్‌కత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంపత్‌ చటర్జీ, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేలుమణి ముక్కంటి దర్శనార్థం వచ్చారు. వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు.
పీటీ ఉష‌
ఒకప్పటి పరుగుల రాణిగా.. ప్రపంచ రికార్డు సాధించిన క్రీడాకారిణి పి.టి.ఉష ఆదివారం ముక్కంటీశుని దర్శనార్థం వచ్చారు. ఈమెకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనానంతరం ఆమెకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Share.

Leave A Reply

%d bloggers like this: