శ్రీ‌కాళ‌హ‌స్తిలో అభిషేక టికెట్ల ధ‌ర‌లకు లెక్క‌లు

0

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతిరోజూ నిర్వహించే శనీశ్వరాభిషేకం పూజలను రూ.150 నుంచి రూ.300కు పెంచారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పూజలు నిర్వహిస్తారు. శనివారం ఈ పూజను ఎక్కువ మంది భక్తులు చేయించుకుంటారు. ఇటీవల రూ.300 టిక్కెట్‌ ద్వారా నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు రూ.500కు పెంపుదల చేశారు. ఇక ఆరు నెలల క్రితం రూ.600 టిక్కెట్‌ ద్వారా నిర్వహించే రుద్రాభిషేకం టిక్కెట్‌ను రూ.1000కి పెంచిన విషయం తెలిసిందే. అదే క్రమంలో సోమవారం శనీశ్వరస్వామి అభిషేకం టిక్కెట్లు రెట్టింపు చేశారు. ఇదే తరహాలో మరికొన్ని పూజా టిక్కెట్లు పెంపుదల చేస్తారని చర్చ సాగుతోతుంది. ఇలా పూజా టిక్కెట్లు పెంపుదల చేయడంతో సామాన్య భక్తులు పూజలు చేయించుకోవడం భారంగా మారుతోదని పలువురు విమర్శలు చేస్తున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: