సప్తగిరి ఎల్‌ఎల్‌బి రివ్యూ

0

టైటిల్: సప్తగిరి ఎల్‌ఎల్‌బి
నటీనటులు: సప్తగిరి.. కాశిష్‌ వోహ్రా.. సాయికుమార్‌.. శివప్రసాద్‌.. షకలక శంకర్‌ తదితరులు
మ్యూజిక్: విజయ్‌ బుల్గానిన్‌
ప్రొడ్యూసర్: డాక్టర్‌ కె.రవి కిరణ్‌
రచన: పరుచూరి బ్రదర్స్‌
డైరెక్టర్: చరణ్‌ లక్కాకుల
కమెడియన్ గా టాలీవుడ్ కు సప్తగిరి తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. కమెడియన్‌లు హీరోలుగా మారడం… మనకు కొత్తేం కాదు.. అదే రూట్ లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో ఫస్ట్ హిట్ కొట్టాడు సప్తగిరి. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా జాలీ ఎల్ఎల్ బీ ని సప్తగిరి ఎక్స్ ప్రెస్ గా మన ముందుకు తీసుకొచ్చాడు. చరణ్‌ లక్కాకుల డైరెక్టర్ గా పరిచయమైన ఈ సినిమా.. సప్తగిరికి మరో హిట్ ఇచ్చిందా..? ఒరిజినల్ మాదిరిగా అలరించిందా.? రివ్యూలో చూద్దాం..
స్టోరీ: సప్తగిరి(సప్తగిరి) ఎల్‌ఎల్‌బి చేస్తాడు. వూరిలో వచ్చిన చిన్న చిన్న గొడవలను తన తెలివితో పరిష్కరిస్తాడు. కానీ, కోర్టులో అడుగుపెడితే ఒక్క కేసూ గెలవలేడు. సిటీకి వెళ్తే పెద్ద, పెద్ద కేసులు చూడవచ్చని.. అనుభవం సంపాదించవచ్చని అనికొని సిటీకి చేరతాడు. ఇదే టైంలో ఓ హిట్‌ అండ్‌ రన్‌ కేసుపై సప్తగిరి దృష్టి పెడతాడు. ఐతే దాన్ని లాయర్ రాజ్‌పాల్‌(సాయికుమార్‌) వాదించి ఆ కేసును కొట్టించేస్తాడు. కానీ ఆ హిట్‌ అండ్‌ రన్‌ కేసును సప్తగిరి తిరగతోడతాడు. ఒక కీలకమైన సాక్షిని కూడా సంపాదిస్తాడు. అయితే ఇదంతా రాజ్‌పాల్‌ ప్లాన్ ఇని.. సాక్షి వెనక రాజ్ పాల్ ఉన్నాడన్న సంగతి తెలుసుకుంటాడు సప్తగిరి. అంతేకాదు రూ.20లక్షలు లంచం తీసుకుని ఆ కేసు నుంచి తప్పుకొంటాడ. అప్పటివరకూ సప్తగిరిని మంచివాడిగా చూసిన జనం.. అతన్ని అసహ్యించుకుంటారు. తప్పు తెలుసుకున్న సప్తగిరి.. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తానని సవాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? సప్తగిరి కేసును ఎలా గెలిచాడు? అనేది మిగిలిన స్టోరీ.
ఎలా ఉంది: బాలీవుడ్‌లో విడుదలైన సూపర్ హిట్ అయిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’కి ఇది రిమేక్‌. కథలోని కీలక అంశాలు, అందులోని సీన్లకు ఒరిజినల్ స్టోరీని ఫాలో అయిపోయారు. కామెడీ, యాక్షన్‌ సీనిస్., కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ సప్తగిరి కోసం జోడించారు. అవి బాగా మెప్పిస్తాయి. డ్యానుల్లో సప్తగిరి అదగొట్టేశాడు. ఫస్ట్ సాంగ్ లో స్టెప్స్ సూపర్ అనిపించాయి. సాయికుమార్‌ ఎంట్రీతో స్టోరీలో మరింత వేగం వచ్చింది. కోర్టు సీన్లర్లను ఒరిజనల్ జాలీ ఎల్ఎల్ బీ తరహాలోనే ఉన్నాయి. మాతృక చూసిన వారికి ఆ ఫీల్‌ తగ్గకుండా ప్రతీ ఒక్కరూ రాణించే ప్రయత్నం చేశారు. చివరి 40 నిమిషాల పాటు జరిగే కోర్టు సీన్స్ సినిమాకు హైలెట్. 0సాయికుమార్‌, సప్తగిరి, శివప్రసాద్‌ పోటాపోటీగా నటించి ప్రతి సీన్ ని రక్తికట్టించారు. కొన్ని డైలాగ్స్ యథాతథంగా వాడుకున్నారు.
ఎలా చేశారు? : ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’తో హీరోగా ఆకట్టుకున్న సప్తిగిరి.. హీరోగా తన రెండో ప్రయత్నంలోనూ బాగా చేశాడు. డ్యాన్సులు, డైలాగ్ డెలివరీలో తన టాలెంట్ చూపించాడు. ఓదశలో సాయికుమార్ తో పోటీ పడి మరీ నటించాడు. యాక్టివ్ గా ఉంటూనే.. సెంటిమెట్, ఎమోషన్ ను కూడా పండించాడు. హిందీలో బొమన్‌ ఇరానీ చేసిన క్యారెక్టర్ కు ఏమాత్రం తీసిపోకుండా సాయికుమార్ నటించాడు. శివ ప్రసాద్‌ నటనా ఆకట్టుకునేలా సాగింది. హీరోయిన్ కు పెద్దగా ప్రాధాన్యం లేదు.
టెక్నికల్ గా ఇలాంటి కథలను రిమేక్‌ చేయటం చాలా కష్టం. మార్పులు ఎక్కువ చేస్తే మొదటికే మోసం వస్తుంది. డైరెక్టర్ స్టోరీని బాగా డీల్ చేశాడు. కోర్ట్ సీన్స్ బాగా చేశారు. పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి
ప్లస్ పాయింట్స్
+ కోర్టు సీన్స్
+ సాయికుమార్‌
+ సప్తగిరి నటన, డ్యాన్సులు
మైనస్ పాయింట్లు
– రొటీన్ స్టోరీ
– పాటలు

Share.

Leave A Reply

%d bloggers like this: