సావిత్రి ఎప్ప‌టికీ చిరంజీవే

0

నాటి తరం మేటి నటి సావిత్రి జీవిత గాథతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్ర నిర్మాణం మొదలెట్టినప్పటి నుంచే ఈ మూవీపై ఇండస్ట్రీలోనూ.. ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా టైటిల్ రోల్ చేసిన కీర్తి సురేష్ కొన్ని ఫొటోల్లో సావిత్రి దిగొచ్చిందా అన్నంత సహజంగా కనిపించింది. మహానటి సినిమా రిలీజ్ కు ముందే చాలామంది ప్రశంసలు అందుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మహానటి రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. సావిత్రి ఫొటోలతో రూపొందించిన వీడియోలో తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు. ‘‘ఎందరో నటీమణులున్నారు. కానీ ఒక్కరే మహానటి. నాకు మాత్రమే దక్కిన అదృష్టం ఏమిటంటే.. నా కెరీర్కు పునాది వేసిన పునాదిరాళ్లు చిత్రంలోనే వారితో కలిసి నటించడం జరిగింది. గ్లిజరిన్ లేకుండా కన్నీరు కార్చగలిగే ఉత్తమ నటి కళ్ల కదలికతోనే హావభావాలను పలికించి తాను కదలకుండా కథంతా నడిపించగలిగే మహానటి ఒక్క సావిత్రి గారే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక నటిగా వ్యక్తిగా అమ్మగా స్ఫూర్తి ప్రదాతగా ఆ సావిత్రమ్మ ఈ చిరంజీవి మనస్సులో ఎప్పటికీ చిరంజీవే. అలాంటి మహానటిపై తీసిన ఈ బయోపిక్తో నేటి తరాలకు ఆమె గొప్ప తనం గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తోన్న చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ మెగా స్టార్ వీడియోలో తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కుమార్తె స్వప్నా దత్ మహానటి సినిమా నిర్మించారు. మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్రలో నటించారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. సమంత సావిత్రి జీవితకథను నెరేట్ చేసే జర్నలిస్టులుగా కనిపించసావిత్రి ఎప్ప‌టికీ చిరంజీవే
బోతున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: