సైనిక్‌ స్కూల్ ఎంట్ర‌న్స్‌ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం

0

అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షకు దరఖాస్తున్న చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి హాల్‌టికెట్లు పొందవచ‍్చని కలికిరి సైనిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కెప్టెన్‌ సైమన్‌ జేవియర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట‍్లను www.sainikschoolsociety.org , www.kalikirisainikschool.com నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునన్నారు. జనవరి 7వ తేదీన ఆదివారం జరిగే ప్రవేశ పరీక్ష ఓ.ఎం.ఆర్‌ విధానంలో ఉంటుందని, విద్యార్థులు నలుపు, నీలం బాల్‌ పాయింట్‌ పెన్‌ మాత్రమే వినియోగించి జాగ్రత్తగా తమ హాల్‌టిక్కెట్‌ నంబరు, సమాధానాలు గుర్తించాలని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ఓ.ఎం.ఆర్‌ పత్రమును మడవడం, చింపడం చేయరాదని తెలిపారు.

Share.

Leave A Reply

%d bloggers like this: