సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని గెలిపించుకోలేని మోడీ

0

గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజ‌యం సాధించింది. అయితే ప్ర‌ధాని మోడీ త‌న స్వగ్రామం వాద్‌నగర్ ఉండే ఉంఝా నియోజకవర్గాన్ని మాత్రం గెలిపించుకోలేక‌పోయారు. ఇక్క‌డ‌ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నారాయణ్‌భాయ్ లల్లుదాస్, కాంగ్రెస్ అభ్యర్థి ఆశా పటేల్ చేతిలో 19,529 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఆశాపటేల్‌కు 81,797 ఓట్లు పోలవగా, నారాయణ్‌భాయ్‌కు 62,268 ఓట్లు పోలయ్యాయి. కాగా, 2012 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి వీరిద్దరూ పోటీపడగా, అప్పట్లో ఆశా పటేల్ 25 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నవసర్జన్ యాత్రలో భాగంగా ఉంఝా నియోజకవర్గంలో పర్యటించారు. వాద్‌నగర్ సమీపంలో ఉండే ఉమియా మాత ఆలయాన్ని సందర్శించారు. ఇదిలా ఉండ‌గా సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోవ‌డంతో మోడీకి ఆద‌ర‌ణ త‌గ్గుతోంద‌ని అందుకే ఆయ‌న సొంతూరు చేయిదాటిపోయింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 2019లో అధికారం చేయిదాటిపోవ‌డానికి సంకేత‌మ‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు జోస్యం చెబుతున్నాయి.

Share.

Leave A Reply

%d bloggers like this: