సోనాలిని ఎంతో ప్రేమించా..షోయ‌బ్ అక్త‌ర్‌

0

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ తెలియని వారు ఉండరేమో.. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ అని పేరున్న ఆయనను గుర్తుచేసుకుంటే వేగంగా దూసుకొచ్చే బంతి గొర్తొస్తుంది. ఆ స్టార్‌ క్రికెటర్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. ఆయన ఓ బాలీవుడ్‌ భామపై మనసు పారేసుకున్నాడట. ఈ విషయం చెప్పగానే వెంటనే ఎవరు ఆమె అని ప్రశ్నించగా సోనాలీ బింద్రే అంటూ కాస్త సిగ్గుపడినట్లుగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తనకు సోనాలి అంటే ఎంతో ఇష్టమని, ఓసారి ఆమెను కలిసేందుకు తమ జట్టు మేనేజర్‌ అనుమతి కూడా తీసుకున్నానని తెలిపాడు. ఆమెను కలిశాక తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నానని, ఒక వేళ ఆమె తన ప్రేమను కాదంటే కిడ్నాప్‌ కూడా చేసేద్దామనుకున్నట్లు వివరించాడు. ఎప్పుడూ తన పర్స్‌లో సోనాలి ఫొటో ఉండేదని, ఆ విషయం తెలిసి తన సహచర ఆటగాళ్లు ఏడిపించేవారని, కానీ, చివరకు తాను మాత్రం ఆమెను కలవకుండానే దూరమయ్యానని అన్నాడు. అలాగే తన ప్రేమను కూడా వ్యక్తం చేయలేకపోయినట్లు వివరించాడు.

Share.

Leave A Reply

%d bloggers like this: