స్నేహితుడ‌ని న‌మ్మితే.. చెల్లినే..

0

జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం మైతాపూర్‌ గ్రామంలోని 8వ తరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు దుండగులు సామూహికంగా అత్యాచారం చేసి వీడియో, ఫొటోలు తీసిన సంఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన విద్యార్థిని రాయికల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం ప్రత్యేక తరగతుల కోసం వెళ్లింది. రోజూ విద్యార్థిని సోదరుడు ఆమెను పాఠశాల వద్ద దిగబెడుతుండగా.. ఆదివారం కరీంనగర్‌కు పనిమీద వెళ్లడంతో .. తన స్నేహితుడైన ఓ మైనర్‌కు తన చెల్లెలిని తీసుకురమ్మని చెప్పాడు. దీంతో అతడు రాయికల్‌కు వచ్చాడు. ఈ సమయంలో అతడి స్నేహితుడు రెడ్డి విజయ్‌ రావడంతో ఇద్దరూ కలిసి బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. గమనించిన విద్యార్థిని గొడవ చేసేందుకు ప్రయత్నించగా.. చంపుతామని బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించారు. తర్వాత ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టారు. విషయం ఎవరికైనా చెబితే చంపుతామని, సెల్‌ఫోన్‌లో తీసిన దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో పెడతామని బెదిరించారు. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. సోమవారం తన మేనబావ రాజుకు చెప్పడంతో నిందితులకు దేహశుద్ధి చేశాడు. సాయంత్రం మైనర్‌ను పోలీసులకు అప్పగించాడు. బాధితురాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల డీఎస్పీ భద్రయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share.

Leave A Reply

%d bloggers like this: