స్పా పేరుతో వ్య‌భిచారం

0

మైసూర్‌ నగరంలోని బోగాది రోడ్డులో ఉన్న ఓ భవనం మొదటి అంతస్తులో సెలూన్, స్పా సెంటర్‌ పేరుతో నిర్వహిస్తున్న వేశ్యావాటికపై పోలీసులు గురువారం దాడి చేశారు. నిర్వాహకులైన దంపతులను అదుపులోకి తీసుకొని అక్కడ వ్యభిచార కూపంలో మగ్గుతున్న యువతికి విముక్తి కల్పించారు. రాజేశ్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి లైక్‌ ట్రెండ్‌ ఫ్యామిలీ సెలూన్, స్పా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని ఆయురహళ్లి గ్రామానికి చెందిన ఓ యువతిని సినిమాల్లో చేర్పిస్తామని చెప్పి వేశ్యాకూపంలోకి దింపారు. ఇటీవల బాధిత యువతి నగరంలో ఉన్న ఒడనాడ మహిళా స్వచ్ఛంద సంస్థకు లేఖ రాసి తన గోడు వెల్లబోసుకుంది. దీంతో ఆ సంస్థ నిర్వాహకులు సరస్వతీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులు ఆ స్పా కేంద్రంపై దాడి చేసి యువతిని రక్షించి స్వచ్ఛంద సంస్థ సభ్యులకు అప్పగించారు. రాజేష్‌ తనపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వ్యభిచారం చేయిస్తున్నారని బాధితురాలు పోలీసుల వద్ద వాపోయింది. స్పా కేంద్రానికి ఇద్దరు కన్నడ నటులు కూడా వచ్చారని, వారికి తానే బాడీ మసాజ్‌ చేసినట్లు బాధిత యువతి పేర్కొంది. దీంతో ఈ కేంద్రానికి ఎవరెవరు వచ్చారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share.

Leave A Reply

%d bloggers like this: