స‌త్య‌సాయి ఆరాధ‌నోత్స‌వాలు ప్రారంభం

0

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాబా నిర్యాణం చెందిన తర్వాత ఏటా ఆరాధనోత్సవాలను ట్రస్టు సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ మందిరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బాబా మహాసమాధిని అందమైన పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. హిల్ వ్యూ స్టేడియంలో 50వేల మంది భక్తులకు చీర, ధోవతులను ట్రస్టు సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుట్టపర్తి వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్నదానం చేస్తున్నారు. అంతకుముందు ఉదయం 8గంటలకు వేదపారాయణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బాబాను కీర్తిస్తూ ప్రముఖ గాయకులు, విద్యార్థులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రాంగణాల్లో నూతనంగా నిర్మించిన సౌర విద్యుత్ ప్లాంటును ప్రారంభించారు. భక్తులు పుట్టపర్తి వచ్చేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గాల్లో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. బాబా శివైక్యం చెంది ఏడేళ్లు గడుస్తున్నా భక్తులు వేలాదిగా తరలివస్తుండటం విశేషం.

Share.

Leave A Reply

%d bloggers like this: