స‌హ‌జీవ‌నం క‌రెక్ట్ కాదు

0

స్టార్‌ స్టేటస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న హీరోయిన్‌లు పెళ్లి గురించి ప్రస్తావించడానికి ఎక్కువగా ఇష్టపడరు. కెరీర్‌ గ్రాఫ్‌ గురించో.. లేదా పర్శనల్‌ విషయాలు ప్రైవేట్‌గా ఉండటం కోసమో పెళ్లి ఊసెత్తితే చాలు మాట దాటేయటమో లేదా మౌనవ్రతం చేస్తుంటారు. కానీ ఆలియా భట్‌ అలా కాదు. 30కి ముందే మూడు ముళ్లు వేయించుకుంటానేమో? అంటున్నారు. పెళ్లి విషయం గురించి ఆలియా మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం పెళ్లి మీద ఎటువంటి ఆలోచనలు లేవు. హానెస్ట్‌గా చెప్పాలంటే ఈ విషయం ఇప్పుడు జరగాలి.. అది అప్పుడు జరగాలి అని ప్లాన్‌ చేసుకునే టైప్‌ కాదు నేను. ఆ క్షణంలో చేయాలనిపించింది చేసేస్తా. నా ఉద్దేశంలో ఏదైనా ఎక్స్‌పెక్ట్‌ చేయనప్పుడు జరిగితేనే అసలు కిక్కు. అందరూ నేను ముప్ఫై ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటాననుకుంటారేమో. దాని కంటే ముందే చేసుకొని సర్‌ప్రైజ్‌ చేస్తానేమో. నాకు లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌ మీద మంచి ఒపీనియన్‌ లేదు. సహజీవనం సరి కాదనన్నది నా అభిప్రాయం. అందుకే నాకు నచ్చినవాడు దొరికితే ‘ఐలవ్‌ యు. మనం పెళ్లి చేసుకుందాం, కలిసుందాం. పెళ్లి తర్వాత కూడా నేను వర్క్‌ చేస్తాను’ అని చెప్పేస్తాను’’ అని పేర్కొన్నారు ఆలియా భట్‌. ప్రస్తుతం బాలీవుడ్‌ యంగ్‌హీరో రణ్‌బీర్‌తో లవ్‌లో ఉన్నారని టాక్‌. ఈ రిలేషన్‌షిప్‌ని ఉద్దేశిస్తూ ఆలియా ఇలా మాట్లాడి ఉంటారా? అంటే సన్నాయి మేళం వినిపించేదాకా చెప్పలేం.

Share.

Leave A Reply

%d bloggers like this: