హోంగార్డుల‌పై కేసీఆర్ వరాల జ‌ల్లు

0

హోంగార్డుల‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభ‌వార్త తెలిపారు. రూ.12 వేలుగా ఉన్న హోంగార్డుల వేత‌నాన్ని రూ.20 వేలకు పెంచుతున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్ హోంగార్డులతో స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… మన ఆదాయం అంతా మన ప్రజలకు చెందాలనే ధ్యేయంతోనే తెలంగాణ‌ రాష్ట్రం కోసం పోరాడామని వ్యాఖ్యానించారు. కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, రిజర్వ్‌డ్ కానిస్టేబుళ్ల నియామకంలో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేసీఆర్ అన్నారు. అంతేగాక‌, డ్రైవర్ల నియామకంలోనూ హోంగార్డులకు 20 శాతం రిజర్వేషన్ ఇస్తామ‌ని తెలిపారు.

హోంగార్డులకు ముఖ్యమంత్రి వరాలు : 

 • నెలవారీ జీతం రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంపు
 • ప్రతీ ఏడాది నెలకు వెయ్యి చొప్పున ఇంక్రిమెంటు
 • హోంగార్డులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు
 • కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా హెల్త్ ఇన్సూరెన్సు
 • ట్రాఫిక్ లో పనిచేస్తున్న హోంగార్డులకు ఇతర పోలీసుల మాదిరిగానే 30 శాతం అదనపు వేతనం
 • కానిస్టేబుళ్ల మాదిరిగా ప్రతీ ఏడాది నాలుగు యూనిఫామ్స్
 • మహిళలకు 6 నెలల మెటర్నటీ లీవులు
 • పురుషులకు 15 రోజుల పెటర్నటీ లీవులు
 • బందోబస్తు డ్యూటీ చేసే హోంగార్డులకు కానిస్టేబుళ్లతో సమానంగా డైట్ చార్జీలు
 • అంత్యక్రియలకు ప్రస్తుతం ఇచ్చే ఐదు వేలను పదివేల రూపాయలకు పెంపు
 • కానిస్టేబుళ్ల మాదిరిగానే పోలీస్ హాస్పిటల్స్ లో హోంగార్డులకు చికిత్స
 • కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో రిజర్వేషన్ పెంపు

టి.ఎస్.ఎస్.పి.                  : ప్రస్తుతం 10 శాతం – ఇకపై 25 శాతం
ఎ.ఆర్                            : ప్రస్తుతం 5 శాతం – ఇకపై 15 శాతం
సివిల్                             : ప్రస్తుతం 8 శాతం – ఇకపై 15 శాతం
పిటిఓ (డ్రైవర్లు)                  : ప్రస్తుతం 2 శాతం – ఇకపై 20 శాతం
పిటిఓ (మెకానిక్స్)             : ప్రస్తుతం 2 శాతం – ఇకపై 10 శాతం
ఎస్.పి.ఎఫ్.                     : ప్రస్తుతం 5 శాతం – ఇకపై 25 శాతం
ఫైర్                              : ప్రస్తుతం 10 శాతం – ఇకపై 25 శాతం
ఎస్.ఎ.ఆర్.సి.పి.ఎల్           : ప్రస్తుతం 5 శాతం – ఇకపై 25 శాతం
పోలీస్ కమ్యూనికేషన్స్       : ప్రస్తుతం 2 శాతం – ఇకపై 10 శాతం

ముఖ్యమంత్రికి డిజిపి కృతజ్ఞతలు:
హోంగార్డుల జీతాలు పెంపడంతో పాటు, వారి సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు డిజిపి ఎం.మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Share.

Leave A Reply

%d bloggers like this: