2022లో గుజ‌రాత్ మ‌న‌దే..రాహుల్‌

0

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినందుకు పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అభినందించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. 2022 ఎన్నికల్లో తప్పకుండా గుజరాత్‌లో అధికారంలోకి వస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తులపై చర్యలు తప్పకుండా తీసుకుంటానని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో 90 శాతం ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేశారని.. అయితేకొందరు పార్టీ నేతల వల్లే కొన్ని విలువైన సీట్లు కోల్పోయామని ఆయన చెప్పారు. శనివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రాహుల్‌ గాంధీ పర్యటించారు. ఈ సం‍దర్భంగా పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాంకేతికంగా ఓటమి పాలైనా.. నైతిక విజయం మాత్రం మనదేనని చెప్పారు. బీజేపీని ఓడించే స్థాయిలో కృషి చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలను గుర్తుంచుకుంటానని ఆయన చెప్పారు.

Share.

Leave A Reply

%d bloggers like this: