26 బంతుల్లోనే సెంచ‌రీ..!

0

పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు బాబర్‌ అజమ్‌ 26 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అది కూడా టీ10 మ్యాచ్‌లో కావడం ఇక్కడ విశేషం. షాహిద్‌ ఆఫ్రిది ఫౌండేషన్‌(ఎస్‌ఏఎఫ్‌) చారిటీ మ్యాచ్‌లో భాగంగా ఎస్‌ఏఎఫ్‌​ గ్రీన్‌ తరపున బరిలోకి దిగిన బాబర్‌ అజమ్‌ 26 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకపడిన బాబార్‌ 11 సిక్సర్లు, 7 బౌండరీలతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎస్‌ఏఎఫ్‌ రెడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ అజమ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఏఎఫ్‌ రెడ్స్‌ 10 ఓవర్లలో 210 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్నిఛేదించే క్రమంలో ఎస్‌ఏఎఫ్‌​ గ్రీన్‌ దీటుగా బదులిచ్చింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అజమ్‌ ఆది నుంచి ఎస్‌ఏఎఫ్‌ రెడ్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.దాంతో ఎస్‌ఏఎఫ్‌​ గ్రీన్‌ ఐదు ఓవర్లలో 100కు పైగా పరుగులు చేసింది. ఇక చివర్లో షాహిద్‌ ఆఫ్రిది బౌండరీ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

Share.

Leave A Reply

%d bloggers like this: