రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు మృతి

0

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపో వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందగా, మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కె.జి సత్రం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. వేగంగా వెళ్తోన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు టెంపో వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృతిచెందారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా తిరుమల నుంచి మైసూర్ వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా, మరణించిన వారు మహారాష్ట్రకు చెందినవారు. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 18 మంది ఉన్నట్లు సమాచారం.

Share.

Leave A Reply

%d bloggers like this: