యాంక‌ర్‌కు అల్లు అర్జున్ వార్నింగ్‌..!

0

బిగ్‌బాస్‌ షో తో వెలుగులోకి వచ్చిన నటి హరితేజ. అప్పటికే పలు సీరియల్లు, సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క బిగ్‌బాస్‌ ద్వారా వచ్చేసింది. అంతే అవకాశాలు వెల్లువెత్తాయి. వరుస టీవీషో లతో యాంకర్‌గా, నటిగా రాణిస్తోంది. తాజాగా హరితేజకు, బన్నీకి ఆసక్తికర సంభాషణ జరిగింది. అల్లు శిరీష్‌ హీరోగా నటించిన ఒక్క క్షణం సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన హరితేజ బన్నీని పొగడ్తలతో ముంచెత్తింది. తనకు అల్లూ అర్జున్ అంటే చాలా ఇష్టం అంటూ మనసులో మాట బయట పెట్టింది. దీనికి స్పందించిన బన్నీ కూడా హరితేజ మంచి నటి అని ఆమె నటన అంటే తనకు ఇష్టం అని చెప్పాడు. అంతేకాకుండా హరితేజకు ఓ స్వీట్‌ వార్నింగ్ కూడా ఇచ్చాడు. మరో సినీ వేదికపై మరో హీరో ఇష్టం అని చెబితే ఊరుకోను అన్నాడు. అలా చేస్తే కచ్చితంగా మీకు ఫోన్ చేసి అడుగుతా అని బన్నీ చిన్నపాటి స్వీట్‌ వార్నింగ్‌ను సరదాగా ఇచ్చాడు. దీనికి స్పందించిన హరితేజ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. నిజంగానే మీరంటే ఇష్టం, ఏసెంటర్లోనైనా మీ పేరే చెబుతా అంటూ బన్నీకి బదులిచ్చింది.

Share.

Leave A Reply

%d bloggers like this: