అణుయుద్ధం ఖాయ‌మ‌నిపిస్తోంది.. పాక్

0

దక్షిణాసియా ప్రాంతంలో అణుయుద్ధం ఖాయ‌మ‌నిపిస్తోంద‌ని పాకిస్థాన్ భద్రతా సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నజీర్ ఖాన్ జాంజువా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదపుటంచుల్లోకి వెళ్తోందని… స్థిరత్వం దెబ్బతింటోందని అన్నారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ విషయంలో భారత్ తో కలసి అమెరికా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను భారత్ సమకూర్చుకుంటోందని ఆందోళ‌న చెందారు. ఈ ఆయుధాలతో ప్రతిసారి పాక్ ను భయపెడుతూ వస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో, అణు యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని వివ‌రించారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రాబ‌ల్యం పెరుగుతుండటంతో…అమెరికా తన వైఫల్యాలను పాకిస్థాన్ పైకి నెడుతోందని నజీర్ మండిపడ్డారు. ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశాన్ని భారత్ కు అమెరికా ఇస్తోందని వెల్ల‌డించారు. ఇది ప్ర‌పంచానికి ఏమాత్రం మంచిదికాద‌ని తెలియ‌జేశారు.

Share.

Leave A Reply

%d bloggers like this: