చిరంజీవి ఆర్థిక సాయం!

0

సినీన‌టులు గుండు హ‌నుమంత‌రావు, పొట్టి వీర‌య్య‌ల‌కు మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం అందించారు. హాస్య‌పాత్ర‌లు వేసి అల‌రించిన గుండు హ‌నుమంత‌రావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న ఈ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే అలీతో జాలీగా ప్రోగ్రాంలో పాల్గొని త‌న పరిస్థితిని చెప్పుకున్నారు. అది చూసిన చిరంజీవి.. గుండు హ‌నుమంత‌రావుకు రూ.2 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీ రాజా ద్వారా అంద‌జేశారు. అలాగే, మ‌రో హాస్య‌న‌టుడు పొట్టి వీర‌య్య ఆర్థిక ప‌రిస్థితుల‌ను గురించి చ‌దివిన చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ ఆయ‌న‌కు సాయం అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఆయ‌న‌కు కూడా చిరంజీవి కుటుంబం ‘మా’ ద్వారా చెక్‌ను అంద‌జేసింది. రెండు రోజుల క్రితం చిరంజీవి త‌మ‌కు ఫోన్ చేశార‌ని, ఇరువురు న‌టుల‌కు క‌లిపి రూ.4 ల‌క్ష‌ల చెక్‌ల‌ను అందించార‌ని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా తెలిపారు.

Share.

Leave A Reply

%d bloggers like this: