సినీ ముచ్చ‌ట్లు..

0

* ‘డీజే’ చిత్రం తర్వాత తాజాగా ‘సాక్ష్యం’ చిత్రంలో నటిస్తున్న కన్నడ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం యూకే టూర్ చేస్తోంది. మిత్రులతో కలసి మాంచెస్టర్ లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ, న్యూ ఇయర్ వేడుకలను కూడా అక్కడే జరుపుకుంటుందట. ఇక జనవరి మొదటి వారంలో ఇక్కడికి వచ్చి షూటింగులో పాల్గొంటుంది.
* ఇటీవల విజయ్ తో ‘మెర్సల్’ వంటి భారీ హిట్ చిత్రాన్ని తీసిన తమిళ దర్శకుడు అట్లీ కుమార్ త్వరలో ప్రభాస్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
* గతంలో ‘పోకిరి’ సినిమాలో ‘చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా..’ పాటలో లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేసిన మహేశ్ బాబు మళ్లీ ఇప్పుడు మరో పాటలో లుంగీ కడుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో ఓ పాటలో మహేశ్ లుంగీతో డ్యాన్స్ చేస్తాడట.
* ప్రముఖ నటుడు జగపతిబాబు పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. నారా రోహిత్ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆటగాళ్లు’ చిత్రంలో జగపతిబాబు ఇలా లాయర్ వేషం వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.

Share.

Leave A Reply

%d bloggers like this: