బీజేపీతో రాజ్యాంగానికి ప్ర‌మాదం

0

సమా ఖ్య వ్యవస్థను, ప్రజా స్వామ్యాన్ని నాశనం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంద ని సీపీఐ జాతీయ కార్యదర్శినారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ 92వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీ డి.రాజా, పార్టీ నేతలు మంగళవారం ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేసి దేశ పరిస్థితులపై చర్చించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. సమాఖ్య వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల విషయాల్లో గవర్నర్లు కల్పించుకుంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నియంతృత్వ శక్తులను ఎదుర్కొనేందుకు ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని డి.రాజా పిలుపునిచ్చారు.

Share.

Leave A Reply

%d bloggers like this: