డేటింగ్ యాప్ హ్యాపెన్ న్యూ ఫీచ‌ర్స్‌

0

డేటింగ్ చేయాల‌ని చాలామందికి ఉండే ఉంటుంది. ముఖ్యంగా యువ‌త‌లో. అయితే ఎలా చేయాలి దానికోసం మార్గాలేమిటో తెలియ‌నివారున్నారు. అలాంటివారి కోసం యాప్స్ ఉన్నాయి. వాటిలో గ్లోబల్ డేటింగ్ యాప్ అయిన ‘హ్యాపెన్’.ఒక‌టి. ఇది వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా కొత్త ఫీచర్లను ఆరంభించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యువతీ, యువకులకు ఎంతో క్రేజీగా మారిన ఈ యాప్ కొత్త ఫీచర్లతో మరింత చేరువ కానుంది. ‘క్రష్ టైం’ పేరిట ఆరంభించిన కొత్త ఫీచర్ ప్రస్థుతం పరీక్షల దశలో ఉందని, దీన్ని మరికొన్ని వారాల్లో విడుదల చేస్తామని ఫ్రెంచ్ స్టార్టప్ కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ తో వినియోగదారుడికి నలుగురి ప్రొఫైళ్లను అందించనుంది. యాప్ అందించే నాలుగు ప్రొఫైల్స్ లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మీరు ఇష్టపడే వారి వివరాలు ఈ యాప్ ద్వారా అందనున్నాయి. మొట్టమొదటి డేటింగ్ యాప్ అయిన ‘హాపెన్’ భారతదేశంలో అధికారికంగా ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించారు. యువత మది దోచిన ఈ డేటింగ్ యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లోని 50 ప్రధాన నగరాలకు చెందిన 3.3 కోట్ల మంది వినియోగిస్తున్నారట.

Share.

Leave A Reply

%d bloggers like this: