టాలీవుడ్‌లో ఐదుగురు డ్ర‌గ్స్ తీసుకున్నారు..!

0

తెలుగు సినీ పరిశ్రమను వణికించిన డ్రగ్స్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ కు చేరింది. మొత్తం 12 మంది నుంచి ఎక్సైజ్ అధికారులు శాంపిల్స్ ను సేకరించిన సంగతి తెలిసిందే. వీరిలో ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలింది. డగ్స్ తీసుకున్నవారిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. అయితే, ఈ ఐదుగురు ఎవరనే విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, తరుణ్, సుబ్బరాజు, చార్మి, ముమైత్ ఖాన్, నందు తదితరులు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

Share.

Leave A Reply

%d bloggers like this: