హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్‌

0

హిమాచల్ ప్రదేశ్ శాసనసభాపక్ష నేతగా బీజేపీ సీనియర్ నేత జైరామ్ ఠాకూర్ ను ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి, పార్టీ కేంద్ర పరిశీలకుడు నరేంద్ర సింగ్ తోమర్ వెల్ల‌డించారు. బీజేపీ శాసనసభాపక్షం సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ, రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ బాధ్యతలు చేపట్టనున్నట్టు చెప్పారు. కాగా, బీజేపీ సీనియర్ నేత అయిన ఠాకూర్ వయసు 52 సంవత్సరాలు. గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా ఆయన పని చేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన ధుమాల్ ఓటమి పాలయ్యారు. దీంతో, సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై జరిగిన చర్చల్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేరు తెరపైకి వచ్చింది.

Share.

Leave A Reply

%d bloggers like this: