పోయెస్‌గార్డెన్‌లో ఐటీ సోదాలు

0

తమిళనాడులో శశికళ, ఆమె బంధువర్గమే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులు కీలక దశకు చేరుకున్నాయి. పోయిస్ గార్డెన్స్ లోని వేదనిలయంలో జయలలిత అంత‌రంగిక గదిని నేడు తెరిచి, అందులో ఏముందో తేల్చాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం ఆమె ఇంటికి అధికారులు చేరుకోగా, ఆమె మాత్రమే వాడిన గదిలో ఏం దాచారన్న విషయాన్ని తెలుసుకునేందుకు భారీ ఎత్తున అన్నాడీఎంకే శ్రేణులు కూడా అక్కడకు చేరుకున్నాయి. ఇప్పటివరకూ చిన్నమ్మ సామ్రాజ్యంపై విరుచుకుపడిన ఐటీ, ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏం దాచుకుందో తేల్చనున్నారు. గతంలో వేదనిలయంలో సోదాలు జరిపినప్పుడు జయ ఆంతరంగిక గదుల జోలికి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఆమె గదిలో ఏముందన్న విషయం నేడు తేలనుంది. ఇదిలా ఉండ‌గా ఆమె గ‌దిలో ఎలాంటి త‌నిఖీలు చేయ‌డంలేద‌ని కేవ‌లం ఆమె గృహాన్ని స్మార‌క‌మందిరంగా మార్చేక్రమంలో వివాదాల‌కు తావులేకుండా ఐటీ అధికారులు వ‌స్తున్నార‌ని ప్ర‌భుత్వం అంటోంది.

Share.

Leave A Reply

%d bloggers like this: