హ‌నీమూన్ నుంచి తిరిగొచ్చిన కోహ్లి, అనుష్క‌

0

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ తార అనుష్క శర్మలు ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. హానీమూన్ ముగించుకున్న ఈ జంట నిన్న స్వదేశానికి చేరుకుంది. తన భార్యను విరాట్ కోహ్లీ నేరుగా తన స్వగృహానికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గులాబీ రంగు చీరలో అనుష్క, షేర్వాణీలో కోహ్లీలు ఆకట్టుకుంటున్నారు. రేపు ఢిల్లీలోని హోటల్ తాజ్ లో వీరు రిసెప్షన్ ఇవ్వనున్నారు. అనంతరం 26వ తేదీన ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు మరో రిసెప్షన్ ఇవ్వబోతున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: