తిరుమ‌ల‌లో 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

0

తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ఈనెల 26వ తేది మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమలమంజనంలో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం. ఈనెల 29వ తేది వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా ఈ వైదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తారు. అర్చకులు ఆగమోక్తంగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆలయ మహద్వారం మొదలు గర్భాలయంవరకు, ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని సంప్రదాయంగా శుద్ధి చేస్తారు. ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. 29 వైకుంఠ ఏకాద‌శి పూజ‌లు, 30న తీర్థ ముక్కోటి..పుష్క‌రిణిలో చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

Share.

Leave A Reply

%d bloggers like this: