వైఎస్‌.జ‌గ‌న్‌తో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి చ‌ర్చ‌లు

0

మదనపల్లె నియోజకవర్గంలో జరుగనున్న ప్రజాసంకల్ప పాదయాత్రపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి చర్చించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో గురువారం ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌.జగన్‌ను ఎమ్మెల్యే కలిసి పాదయాత్ర చేశారు. మదనపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర జరిగే పల్లెలు, అక్కడి పరిస్థితులు, ప్రజల సమస్యలను వివరించారు. చేనేత కార్మికుల సమస్యలు, మెగా క్లస్టర్‌ ఏర్పాటు, టమాటా రైతుల కష్టాలు, గిట్టుబాటు ధర, డార్క్‌ ఏరియా ఉత్తర్వుల తొలగింపు తదితర ప్రధాన సమస్యలను వివరించారు. ప్రజాసంకల్పయాత్ర కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాంతో కలిసి మదనపల్లె నియోజవర్గ రూట్‌మ్యాప్‌ ఏరియాల్లో పర్యటించారు. పర్యటనకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు, వసతి, ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించాలన్న ప్రణాళికకు తుదిమెరుగులు దిద్ది నివేదికను తయారుచేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్‌ కౌన్సిలర్లు, మండలంలోని వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: