ప్రేమికులకు ఓ న‌గ్న హోట‌ల్‌..!

0

అదో న‌గ్న హోట‌ల్‌.. అందులోకి న‌గ్నంగా వెళ్లాలి. అందులో స‌ర్వ‌ర్ కూడా న‌గ్నంగానే క‌నిపిస్తారు. ఇలాంటి హోట‌ల్‌కు వెళితే బాగుండ‌నిపిస్తోందా.. అయితే కొంచెం ఆగండి. ఎందుకంటే ఆ హోట‌ల్ స్పెయిన్ దేశంలో ఉంది. డి లియోనార్డిస్ పేరుతో ఆ నగ్న హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్ లోనికి ప్రేమికులు, దంపతులను మాత్రమే అనుమతిస్తారు. ఈ హోటల్ లోపలికి వెళ్లాలంటే ఎంట్రన్స్‌లోనే కస్టమర్లు తమ దుస్తులను విప్పి హోటల్ నిర్వాహకుల వద్ద అప్పగించాలి. అంతేగాకుండా సెల్ ఫోన్లను కూడా ఇచ్చేయాలి. హోటల్‌లోనికి వెళ్లగా ప్రేమికులు లేదా దంపతులు క్యాండిల్ వెలుగులో టేబుళ్లపై ఆసీనులై.. ఆహార పదార్థాలను ఆర్డర్ చేయొచ్చు. సర్వర్ కూడా ఇక్కడ నగ్నంగానే కనిపిస్తారు. కస్టమర్లు కోరిన ఆహారాన్ని టేబుల్‌కు సర్వ్ చేస్తారు. ఈ హోటల్‌కు వచ్చేందుకు దంపతులు వచ్చేందుకు మోస్తరుగా ఆసక్తి చూపుతున్నా ప్రేమికులు మాత్రం ఈ హోటల్‌కు వెళ్లేందుకు ఎగబడుతున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: