ట‌మాట రైతు కుదేలు

0

అనంత‌పురంలో కిలో రూపాయి
ప‌శువుల‌కు మేత‌గా ట‌మాట‌
తీవ్రంగా న‌ష్ట‌పోయిన రైత‌న్న‌
మొన్నటి వరకు ఆకాశాన్నంటిన టమోటా ధర అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. అనంతపురం మార్కెట్‌లో రైతు అమ్ముకోబోతే కిలోకు ఒక్క రూపాయి కూడా ధర పలకడం లేదు. దీంతో పొలంలోనే పంట వదిలేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల పశువులు మేయడానికి పారబోసిన పరిస్థితీ ఉంది. అయితే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బహిరంగ మార్కెట్లో రూ.12, రైతు బజార్లలో రూ.10 ఉన్న ధరను బట్టి చూసినప్పడు రైతు తాను పండించిన టమోటాను మార్కెట్లో ఎంత హీనమైన ధరకు అమ్ముకున్నాడో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ మధ్యనే ధర పెరిగి కాస్త గిట్టుబాటు లభిస్తుందనుకున్న రైతు రైతన్న ఆశలు అంతలోనే ఆవిరయ్యాయి. పెట్టుబడి కాదుకదా కనీసం కాయలు కోసేందుకయ్యే కూలి కూడా గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి వస్తే ఇప్పుడు కిలో రూపాయికి కూడా మార్కెట్‌లో ధర పలకడం లేదు. విశాఖపట్నంలో దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ఏడాది వర్షాలు బాగా రావడంతో అనంతపురం జిల్లాలో బోరుబావుల కింద సుమారు 50 వేల ఎకరాల్లో టమోటా సాగు చేశారు. ఇప్పుడు పంటంతా కోత దశకు వచ్చేసింది.
గిట్టని కూలి 
ఒక ఎకరంలో టమోటా పంట కోసేందుకు సుమారు రూ.ఆరేడు వేలు ఖర్చు అవుతుంది. ఇప్పుడున్న ధరల్లో అమ్మితే రూ.ఐదు వేలలోపే ఆదాయం వస్తుంది. ఎకరానికి పంట తొలగింపునకు రెండు వేల వరకు ఖర్చు అవుతుంది. ఆపైన బాక్సుల్లో నింపి మార్కెట్‌ యార్డుకు తరలించేందుకు రవాణా, బాక్సు బాడుగ అన్నీ కలిపితే ఒక్కో దానికి రూ.16 ఖర్చు అవుతుంది. పంట దిగుబడి బాగా వస్తే 200 బాక్సులు దిగుబడి వస్తుంది. ఈ లెక్కన రూ.3,200 ఖర్చు అవుతుంది. ఆపైన మార్కెట్‌లో అమ్మితే వ్యాపారికి పది శాతం కమిషన్‌ కలిపితే రూ.600 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర హమాలీ ఖర్చులన్నీ కలిపి మరో వెయ్యి రూపాయల వరకు రైతు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మొత్తంగా ఎకరం పంట దిగుబడి అమ్ముకోవడానికి రూ.6,800లు ఖర్చు అవుతోంది. మార్కెట్‌లో ఇప్పుడున్న ధర ప్రకారం రైతు ఒక బాక్సు (15 కిలోలు) రూ.15 చొప్పున అమ్మితే రూ.మూడు వేల ఆదాయం వస్తుంది. అంటే రైతు పంట తొలగింపు నుంచి మార్కెట్‌లో అమ్ముకోవడానికే రూ.3,800 నష్టమొస్తుంది. టమోటా నారు తెచ్చి నాటినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు చేసిన వ్యయం మొత్తం నష్టమే. ఎకరానికి సగటున రూ.50 వేల వరకు రైతు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా టమోటా రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

Share.

Leave A Reply

%d bloggers like this: