600 కిలోమీట‌ర్లు పూర్తి

0

అధికార పక్షం అవినీతిని ఎండగడుతూ.. అదే సమయంలో ప్రజా సమస్యలను తెలుసుకుని భరోసా ఇస్తూ ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన చేపట్టిన పాదయాత్ర నేటికి 43వ రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పడు ఈ యాత్ర మరో మైలు రాయిని అందుకుంది. పాదయాత్రలో భాగంగా ఆయన 600 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. అనంత‌పురం జిల్లా క‌దిరి నుంచి ఉద‌యం ప్రారంభ‌మైన యాత్ర మదర్వతండా కదిరి, గంగానపల్లె క్రాస్‌, కమటంపల్లి, కోటిపల్లి క్రాస్‌, మిద్దివరిగొండి, డోర్నాల నల్లవారిపల్లి మీదుగా కటారుపల్లికి వైఎస్‌ జగన్‌ చేరుకోన్నారు. కటారుపల్లిలో కటారుపల్లి గ్రామం వద్దకు చేరుకున్న ఆయనకు ఆ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 600 కిలోమీటర్ల మైలురాయి అందుకున్న వైఎస్‌ జగన్‌ ఓ మొక్కను నాటారు. అనంతరం గ్రామస్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపై పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన.. మధ్యాహ్నం భోజన విరామం తీసుకుని పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు. నేటి పాదయాత్ర సాయంత్రం గాండ్లపెంట గ్రామంలో ముగియనుంది.

Share.

Leave A Reply

%d bloggers like this: