ప‌వ‌న్ ఓ ఎనిగ్మా..కేటీఆర్‌

0

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘ఎనిగ్మా’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. గురువారం ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చిన ఆయన దాదాపు రెండు గంటలపాటు లైవ్ చాట్ నిర్వహించారు. రాజకీయాల నుంచి వ్యక్తిగత విషయాల వరకు పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తన అభిమాన హీరో గురించి చెప్పాలని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఎన్టీఆర్‌ని ‘పెర్ఫార్మర్’ అని, మహేష్‌బాబును ‘స్క్రీన్ ప్రెజెన్స్‌లో సూపర్ స్టార్’ అని, ప్రభాస్‌ను ‘బాహుబలి’ అని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ గురించి చెబుతూ ఆయనను ‘ఎనిగ్మా’ అని పేర్కొన్నారు. ఎనిగ్మా అంటే ఎవరికీ అర్థంకాని వ్యక్తి అని తెలిపారు. పవన్ రాజకీయ భవితవ్యం గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అది ప్రజలు నిర్ణయిస్తారని వివరించారు. సమంత గురించి చెబుతూ తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత అని, చాలా సున్నిత మనస్కురాలని తెలియ‌జేశారు. మెట్రో రైలు చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఓ నెటిజన్ ప్రశ్నకు మిగతా మెట్రోలు, ఏసీ బస్సు టికెట్లతో సమానంగా ఉన్నాయని తెలిపారు.

Share.

Leave A Reply

%d bloggers like this: