నిర్మాత‌గా అల్లుఅర్జున్

0

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ ఒక వైపు హీరోగా చేస్తూనే మ‌రోవైపు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ డ‌బుల్ యాక్ష‌న్ కోసం ఇప్ప‌టికే రంగం సిద్ధ‌మైంద‌ట‌. పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు .. చరణ్ ఇప్పటికే సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. సొంత బ్యానర్ పై అవసరమైతే తమ సినిమాలు .. లేదంటే ఇతర హీరోల సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ కూడా సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ నిర్మాణ సంస్థలో తాను ఏ సినిమా చేయాలనే విషయంలోనూ ఆయన పూర్తి స్పష్టతతో ఉన్నాడని అంటున్నారు. 2018 ఏప్రిల్ లో ఈ బ్యానర్లో సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.. ప్రస్తుతం ‘ నా పేరు సూర్య’ చేస్తోన్న బన్నీ, ఆ తరువాత సినిమాను వి.ఐ. ఆనంద్ తో చేయనున్నట్టు సమాచారం.

Share.

Leave A Reply

%d bloggers like this: