పరకామణి నూతన భవనంలో టిటిడి ఈవో పూజలు

0

డిసెంబరు 13, తిరుపతి, 2017: శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకల్లో వస్తున్న నాణేల లెక్కింపు కోసం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పరకామణి భవనంలో బుధవారం ఉదయం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నోట్ల పరకామణి తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతుండగా, నాణేల లెక్కింపును ఇకపై పూర్తిగా తిరుపతిలోనే నిర్వహిస్తారు.

మొత్తం రూ.4 కోట్లతో మూడు అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో స్కానింగ్‌, పరకామణి హాల్‌, నాణేలు జల్లించే వసతులున్నాయి. మొదటి అంతస్తులో విదేశీనాణేలు, రెండో అంతస్తులో చిరిగిన, పసుపు కుంకుమ కలిసిన నోట్లు లెక్కింపు, మూడో అంతస్తులో బంగారు, వెండి తదితర విలువైన వస్తువులను వేరు చేసేందుకు వసతులు కల్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, పరకామణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: