దుబాయ్‌లో సాహో షూటింగ్‌

0

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రన్ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. కొద్ది రోజులుగా షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న సాహో యూనిట్ త్వరలో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించనుంది. దుబాయ్ లో ఈ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సీన్స్ కోసం ప్రభాస్ మరోసారి భారీ దేహంతో కనిపించనున్నారట. గత నెల రోజులుగా ఈ యాక్షన్ సీన్స్ కోసం బాడీ పెంచే పనిలో ఉన్నాడు ప్రభాస్. అబుదాబిలో చిత్రీకరించనున్న ఈ ఫైట్స్ కు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం కావాల్సి ఉన్నా.. అనుమతులు రాని కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.

Share.

Leave A Reply

%d bloggers like this: