రామ మందిరం త‌ర్వాత సీతా మందిరం

0

అయోధ్య‌లో రామ మందిరం నిర్మించాలంటూ ఎన్నో ఏళ్లుగా వాదిస్తోన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఈ రోజు మ‌రో విష‌యం వెల్ల‌డించారు. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం త‌రువాత తాను బీహార్‌లోని సీతామ‌హ్రీలో సీతా మందిరం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఆ ప్రాంతాన్ని సీత జ‌న్మ‌స్థ‌లంగా హిందువులు భావిస్తారు. అక్క‌డ సీత మందిరాన్ని నిర్మించాల‌ని చాలా కాలం నుంచి హిందూ సాధువులు డిమాండ్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే అయోధ్య‌లో రామ మందిరం నిర్మిస్తామ‌ని చెబుతోన్న‌ సుబ్రహ్మ‌ణ్య స్వామి.. ఇక తాను త‌దుప‌రి సీతా మందిరంపై గ‌ళం విప్పుతాన‌ని ట్వీట్ ద్వారా స్ప‌ష్టం చేశారు.

Share.

Leave A Reply

%d bloggers like this: