స‌న్నీలియోన్ కుర‌చ దుస్తులు ధ‌రిస్తే ఊరుకోం

0

స‌న్నీలియోన్ కు వ్యతిరేకంగా బెంగళూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో నిర్వహించనున్న నూతన ఆంగ్ల‌ సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొనన్నారు. దీనికి నిరసనగా కర్ణాటక రక్షణ వేదిక యువసేన నగరంలోని మాన్యతా టెక్‌ పార్కు ఎదుట ఆందోళన చేపట్టారు. సన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమ సంస్కృతిని అవమానించడమే నని ఆమె ఫొటోలు తగులబెట్టారు. న్యూ ఇయర్ వేడుకలు నిలిపేయకుంటే డిసెంబరు 31న ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడతామని యువసేన సంఘం కార్యకర్తలు హెచ్చరించారు. ‘సన్నీ పొట్టి దుస్తులు ధరించడాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ఆమె చీర కట్టుకుని కార్యక్రమానికి వస్తే.. వెళ్లండి, చూడండి. సన్నీకి గతం బాగోలేదు. ఇలాంటి వారిని మేం ప్రోత్సహించం. డిసెంబరు 31న ఆత్మహత్యకు పాల్పడటానికి మేం ఏ మాత్రం సంకోచించడం లేదు’ అని స్ప‌ష్టం చేశారు. అయితే నిర్వాహకులు మాత్రం మరో వెర్షన్ వినిపిస్తున్నారు. ఇక్కడి సంస్కృతికి తగినట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం.దీని వల్ల రాష్ట్ర సంస్కృతికి ఎటువంటి అవమానం జరగదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా సన్నీ పలు కన్నడ సినిమాల్లో నటించారు. ‘డీకే’ అనే చిత్రంలో అతిథి పాత్రను పోషించారు. అప్పుడు లేని ఆందోళనలు ఇప్పుడు కొత్తగా ఎందుకో అర్థం కావటంలేదని పేర్కొన్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: